సాధారణంగా గీతా ఆర్ట్స్ రీమేక్ చిత్రాల జోలికి పోదు. అయితే... తొలిసారి మలయాళ సినిమా `నాయట్టు`పై ప్రేమ పెంచుకుని, రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. మూడు ప్రధాన పాత్రలతో సాగే కథ ఇది. రాజకీయ వ్యంగ్యాస్త్రం. ఈ సినిమా కోసం నటీనటులు, దర్శకుడి ఎంపిక దాదాపుగా పూర్తయిపోయినట్టే. మూడు ప్రధాన పాత్రల్లో శ్రీవిష్ణు, అంజలి, రావు రమేష్ నటిస్తారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తారు. `పలాస`తో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్. `ఆహా` కోసం మెట్రో కథల్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఇప్పుడు `శ్రీదేవి సోడా సెంటర్` సినిమాని రూపొందిస్తున్నారు. ఆయనైతే ఈ రీమేక్ కి కరెక్ట్ ఆప్షన్ అన్నది గీతా ఆర్ట్స్ ఉద్దేశం. కేవలం నెల రోజుల్లో షూటింగ్ ని పూర్త చేయాలన్నది ప్లాన్. `శ్రీదేవి సోడా సెంటర్` షూటింగ్ పూర్తయిపోవడంతో కరుణ కుమార్ ఫ్రీ అయ్యాడు. త్వరలోనే స్క్రిప్టు పనులు మొదలెడతారు. ఈ సినిమా ఓటీటీ కోసమని ప్రచారం జరుగుతోంది. `ఆహా` కోసం ఈ సినిమాని రూపొందిస్తున్నారని టాక్. మొత్తానికి గీతా ఆర్ట్స్ లో అటు కరుణకుమార్ కీ, ఇటు శ్రీవిష్ణుకీ మంచి ఆఫరే వచ్చింది.