నీది నాది ఒకే కథ విడుదల తేదీ ఖరారు

By iQlikMovies - March 12, 2018 - 10:31 AM IST

మరిన్ని వార్తలు

శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. 

టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులకు యూత్ ను విశేషంగా ఆకట్టుకొని చిత్రం పై ఆసక్తిని భారీగా పెంచేసాయి. ఇప్పటివరకు విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన 'బిచ్చగాడు' ఫేమ్ సాట్నా టైటస్ జతగా కనిపించనున్నారు. 

ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS