అల్లు అర్జున్ తో శ్రీవిష్ణుకి మంచి అనుబంధం వుంది. అల్లూరి ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చారు అల్లు అర్జున్. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ పై తనకి వున్న ప్రేమని బయటపెట్టాడు శ్రీవిష్ణు. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ ని తన టైటిల్ గా వాడుకున్నాడు. శ్రీవిష్ణు ప్రస్తుతం వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ చిత్రానికి సామజవరగమన అనే టైటిల్‌ను పెట్టారు. అల వైకుంఠపురంలో పాపులర్ సాంగ్ ఇది. ఇదే శ్రీవిష్ణు సినిమాకి టైటిల్ అయ్యింది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇదో కామెడీ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది. వేసవిలో సినిమాని విడుదల చేయబోతున్నారు.