హీరోగా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. నవ్వించినా, ఏడిపించినా, విలనిజం చూపించినా తెరపై ఆయా పాత్రలే కనిపిస్తాయి కానీ, శ్రీ విష్ణు కనిపించడు. అదే శ్రీ విష్ణు స్పెషాలిటీ. ఇప్పుడు శ్రీ విష్ణు తాజాగా 'తిప్పరా మీసం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. కానీ, పబ్లిసిటీ ఇంకాస్త పెంచితే బాగుండేది అని శ్రీ విష్ణు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాలో నిక్కీ తంబోలీ హీరోయిన్గా నటిస్తోంది. 'చీకట్లో చితక్కొట్టుడు' సినిమాలో అందాల ఆరబోతతో ఆకట్టుకున్న ఈ భామ ఈ సినిమాలో ఎలా కనిపించనుందో అస్సలు హింట్ ఇవ్వలేదు ఇంతవరకూ చిత్ర యూనిట్. శ్రీ విష్ణు మాత్రం రగ్గ్డ్ లుక్‌లో చాల వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. అలాగే డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి శ్రీ విష్ణు లుక్స్‌లో. ఈ లుక్స్‌ని బట్టి చూస్తే, సినిమాలో సమ్‌థింగ్ ఆసక్తికరమైన ఇష్యూ దాగుందని తెలుస్తోంది. అయినా, మనోడు ఎంచుకునే సబ్జెక్ట్స్ అలాంటివే.
విషయం లేకుంటే, మనోడికి అస్సలు రుచించదు. ఓ తెగ రికార్డులు కొల్లగొట్టేయాలి అనుకోడు కానీ, ఓ మంచి సినిమాని ఫ్యాన్స్ కోసం చేయాలనుకుంటాడు శ్రీ విష్ణు. చేస్తాడు. అంతే. మరి తాజా చిత్రం శ్రీ విష్ణుకి మీసం తిప్పేంత సక్సెస్ ఇస్తుందా.? చూడాలిక. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకి కృష్ణ విజయ్. ఎల్ దర్శకత్వం వహించారు.