మూడూ... మూడే... ఈ వారం సంద‌డే!

By iQlikMovies - March 09, 2021 - 11:48 AM IST

మరిన్ని వార్తలు

ప్ర‌తీవారం బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త సినిమాలు వ‌రుస‌క‌ట్ట‌డం... సాధార‌ణ‌మైపోయింది. 2020లో ఎలాగూ కొత్త సినిమాల హ‌డావుడి లేక‌పాయె. అందుకే ఆ బాకీ 2021లో తీర్చేసుకుంటోంది చిత్ర‌సీమ‌. ఈ గురువారం... మూడు సినిమాలు రాబోతున్నాయి. మ‌హా శివ‌రాత్రిన‌.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర వినోదాలు పుష్క‌లంగా ల‌భించ‌బోతున్నాయి. శ్రీ‌కారం, జాతిర‌త్నాలు, గాలి సంప‌త్‌.. ఈ వారం ప్రేక్ష‌కుల తీర్పు కోరుకుంటూ విడుద‌ల అవుతున్నాయి.

 

మూడూ.. మూడే. ఈ మూడింటిపైనా మంచి అంచ‌నాలున్నాయి. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం శ్రీ‌కారం. రైతు స‌మ‌స్య‌ల‌పై ఈ సినిమా దృష్టి పెట్టింది. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌కు కొద‌వ లేదు. రైతు క‌థంటేనే క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఆ విష‌యంలో డౌటే లేదు. ప్ర‌చార చిత్రాలు కూడా బాగున్నాయి. `భ‌లేగుంది బాలా..` పాట ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ట‌య్యింది. ఇక ఈ వారం.. వ‌స్తున్న మ‌రో సినిమా `జాతి ర‌త్నాలు`. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ల కంబైన్డ్ అల్ల‌రి ఈ సినిమా. సినిమా మొత్తం.. వినోదాల వ‌ల్ల‌రిగా సాగుతుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే... ప్ర‌చార చిత్రాలు సైతం బాగా న‌వ్విస్తున్నాయి.

 

ఈ సినిమా ప్ర‌చారం కూడా కొత్త పంథాలో చేస్తున్నారు. ఇక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు... అనిల్ రావిపూడి నిర్మాత‌గా మారి తీసిన సినిమా `గాలి సంప‌త్‌`. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తండ్రీ కొడుకులు గా వాళ్ల పాత్ర చుట్టూనే క‌థంతా న‌డుస్తుంది. అన్ని ర‌కాల ఎమోష‌న్స్ నీ బాగా మిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చార చిత్రాలు చూస్తే అర్థ‌మైపోతోంది. ఈ మూడు సినిమాల‌పై మంచి అంచ‌నాలున్నాయి. బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జ‌రిగింది. సో.. ఈ వారం బాక్సాఫీసు హోరెత్తిపోవ‌డం ఖాయం. మ‌రి అంతిమ విజేత ఎవ‌రో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS