శర్వానంద్ నటించిన సినిమా `శ్రీకారం`. బాక్సాఫీసు దగ్గర యావరేజ్ టాక్ దక్కించుకుంది. అయితే మంచి ప్రయత్నంగా మాత్రం పేరు తెచ్చుకుంది. నటుడిగా శర్వానంద్‌కి మరోసారి మంచి మార్కులు పడ్డాయి. అయితే... తన పారితోషికం మాత్రం పూర్తిగా అందలేదట. ఈ విషయంలో 14 రీల్స్ సంస్థకీ, శర్వాకీ వివాదం కూడా మొదలైందని టాక్. శర్వా పారితోషికంలో చివరి పేమెంట్ చెక్కుల రూపంలో శర్వాకి ఇచ్చారు.
చెక్ లు బ్యాంకులో వేస్తే క్యాష్ లేదని తెలిసింది. ఈ విషయమై నిర్మాతల్ని ఎన్నిసార్లు సంప్రదించినా సరైన స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు శర్వా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడట. 14 రీల్స్ సంస్థ అంటే... పెద్ద బ్యానరే. మంచి రెపుటేషన్ ఉంది. ఇలాంటప్పుడు శర్వా లాంటి హీరో కేసు పెడితే.. ఆ సంస్థ గౌరవం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ విషయంలో నిర్మాతలు కాస్త చొరవ తీసుకుంటే బాగుంటుందేమో..?