`ధమాకా` హిట్ తో.... 2022ని ముగించింది టాలీవుడ్. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. వరుస పరాజయాలకు ధమాకా హిట్టుతో బ్రేక్ వేశాడు రవితేజ. అయితే... క్రెడిట్ అంతా తనకు రాలేదన్న విషయంలో రవితేజ తెగ ఫీలైపోతున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. శ్రీలీల డాన్సులు, తన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి... జనాలు గొప్పగా మాట్లాడుకొంటున్నారు. బీ, సీ సెంటర్లలో శ్రీలీల డాన్సులు చూడ్డానికే జనాలు రిపీటెడ్ గా వెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజపై శ్రీలీలదే అప్పర్ హ్యాండ్ అనేది అందరి మాట. ఇదంతా.. రవితేజకు నచ్చడం లేదని తెలుస్తోంది. పైగా... రచయిత ప్రసన్నకుమార్ బెజవాడకు ఎక్కువ మార్కులు పడ్డాయి. పల్సర్ బైకు పాట, భీమ్స్ మ్యూజిక్కూ ఇవన్నీ రవితేజ కృషిని మైమరపించేలా చేశాయి.
పైగా దర్శకుడు నక్కిన త్రినాథరావుకీ క్రెడిట్ దక్కలేదు. ఎక్కడా నక్కిన మాట వినిపించడం లేదు. దానికి తోడు ఇది రొటీన్ కథ.. రొటీన్ ట్రీట్ మెంట్. మాస్ అంశాలు బాగా పట్టడం వల్ల జనాలకు ఎక్కేసింది కానీ, లేదంటే పూర్తిగా బోల్తా పడేది. సినిమా హిట్టయినా హీరోకీ, దర్శకుడికీ క్రెడిట్ రాకపోవడం..`ధమాకా`తోనే జరిగిందేమో..?