చిరంజీవి, రవితేజ, బాబీ మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య ట్రైలర్ బయటికి వచ్చింది. ''నా డిపార్ట్ మెంట్ వాళ్ళు ఒక ఇంటర్ నేషనల్ క్రిమినల్ ని తీసుకొస్తున్నారు. ఈ రాత్రికి నీ కస్టడీలో జాగ్రత్తగా ఉంచు'' అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైయింది.
అతనొక డ్రగ్స్ స్మగ్లర్.. మా డిపార్ట్మెంట్ డాటా బేస్ లో అతనొక పాపులర్ ఖైధీ.. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరుపెట్టిందే ఆయన్ని చూసి.. ఇలాంటి ఇంట్రో డైలాగులతో మెగాస్టార్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. వైజాగ్ లో మొదలైన కథ మలేసియాతో కనెక్ట్ కావడం ఆసక్తికరంగా వుంది. భారీ యాక్షన్ ఎంట్రీ తర్వాత కొన్ని కామెడీ సీన్లు చూపించారు.
'మీ కథలోకి నేను రాలేదు.. నా కథలోకే అందరూ వచ్చారు. వీడు నా ఎర నువ్వే నా సొర''అనే డైలాగ్ తర్వాత రవితేజ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా వుంది. తర్వాత వచ్చిన యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయి.
'రికార్డ్స్ లో నా పేరుండటం కాదు నా పేరు మీద రికార్డులు వుంటాయి''అని చిరు చెప్పిన డైలాగ్ పేలింది. చివర్లో చిరంజీవి, రవితేజ ఇడియట్, ఘరానామొగుడు సినిమాల పాపులర్ డైలాగ్స్ చెప్పడం కొసమెపురుగా నిలిచింది. చివర్లో చిరంజీవి ఏనుగుపై వున్న షాట్ క్యురియాసిటీని పెంచింది. మొత్తానికి సంక్రాంతి చిరంజీవి అభిమానులకు ఫుల్ మీల్ లాంటి సినిమా వాల్తేరు వీరయ్య అని నమ్మకాన్ని ఇచ్చింది ట్రైలర్.