ఈరోజుల్లో హీరోయిన్లు కోటి రూపాయల పారితోషికం అందుకోవడం కామన్ అయిపోయింది. తొలి సినిమాకి అంతంత మాత్రంగా ఇచ్చినా - ఆ సినిమా హిట్టయ్యేసరికి వాళ్ల పారితోషికం అమాంతంగా పెరిగిపోతోంది.
శ్రీలీల విషయంలో ఇదే జరిగింది. పెళ్లి సందడితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఆ సినిమాకి తన పారితోషికం రూ.6 నుంచి 8 లక్షలలోపే. అయితే ఆ సినిమా హిట్టవ్వడంతో శ్రీలీలకు వరుసగా అవకాశాలు వచ్చిపడిపోయాయి. రెండో సినిమాకి రూ.50 లక్షలు, మూడో సినిమాకి రూ.75 లక్షలు అందుకొన్న శ్రీలీల.. ఇప్పుడు ఏకంగా కోటిన్నర పలుకుతోందట. ప్రస్తుతం ఆమె నటించిన `ధమాకా` ఈనెల 23న విడుదల అవుతోంది. నితిన్, రామ్ పోతినేని సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల. అంతే కాదు.. మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలోనూ ఛాన్స్ అందుకొంది. బాలకృష్ణ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది.
ఇప్పుడు కొత్తగా ఒప్పుకోబోయే సినిమాల్లో తన పారితోషికం కోటిన్నర. ఈ మైలు రాయిని అతి వేగంగా అందుకొన్న కథానాయిక శ్రీలీలే అని ట్రేడ్ వర్గాల టాక్. మరో రెండు హిట్లు పడితే... రెండు కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.