పెళ్లి సందడి సినిమా తెరపై మెరిసిన క్యుట్ హీరోయిన్ శ్రీలీల. ఈ సినిమాలో ఆమె క్యుట్ యాక్టింగ్, డ్యాన్సులు యువతకు తెగ నచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు శ్రీలీల బిజీ హీరోయిన్ . ఇప్పుడు ఆమె చేతిలో మూడు పెద్ద సినిమాలు వున్నాయి. ఇదే వరుసలో హీరో నితిన్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేశారు. సినిమాకి ఏప్రిల్ మొదటి వారంలో ముహూర్తం జగరనుంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల రవితేజ ధమాకా చిత్రంలో నటిస్తుంది. ఇదికాకుండా మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కనున్న సినిమాలో ఆమెను ఒక హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇదే కాకుండా వరుణ్ తేజ్ కొత్త సినిమాలో కూడా శ్రీలీల పేరునే పరిశీలిస్తున్నారు.