టాలీవుడ్ కి మరో కొత్త సోయగం వచ్చింది. తనే శ్రీలీల. పెళ్లి సందడి సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆసినిమా ఫ్లాప్ అయినా, ఈ అమ్మాయి అందరి కంట్లో పడిపోయింది. పెళ్లి సందడి రిలీజ్ కాకుండానే.. రవితేజ సినిమాలో ఆఫర్ అందుకుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తన చేతుల్లోకి వెళ్లింది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీలీల చేతిలో అడ్వాన్స్ పెట్టేశాడు. తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డితో ఓసినిమా చేస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆశిష్ రెడ్డి హీరోగా `రౌడీ బోయ్స్` సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఆశిష్ రెడ్డితో మరో సినిమా చేయబోతున్నాడు దిల్ రాజు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తారు. దర్శకుడు ఎవర్ననది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో నాలుగు ఆఫర్లు శ్రీలీల చేతిలో ఉన్నట్టు టాక్. మరో యేడాది వరకూ శ్రీలీల ఎవరికీ దొరకదు.