బిగ్‌ మిస్టేక్‌: తప్పు చేసిన శ్రీముఖి, డైరెక్ట్‌ నామినేట్‌ అయ్యింది!

మరిన్ని వార్తలు

బిగ్‌ హౌస్‌లో ఓ తప్పు జరిగింది. ఏమా తప్పు? ఏందా కథ? అంటే, హౌస్‌లో సడెన్‌గా టెలిఫోన్‌ బూత్‌ ప్రత్యక్షమైంది. గార్డెన్‌ ఏరియాలో తిరుగుతున్న శ్రీముఖి అది గమనించింది. ఈ లోగా బూత్‌ నుండి టెలిఫోన్‌ రింగయ్యింది. మన రాములమ్మ క్యూరియాసిటీతో ఆ ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది. ఇంకేముంది. శిక్షార్హులైంది. ఆ ఫోన్‌ ఎవరైతే ముందుగా లిఫ్ట్‌ చేస్తారో వారు డైరెక్ట్‌గా నామినేట్‌ అవుతారన్న మాట. అదో సీక్రెట్‌ టాస్క్‌ అయ్యి ఉండొచ్చు. అది గమనించని శ్రీముఖి బుక్కయిపోయింది.

 

ఈ వారం డైరెక్ట్‌గా నామినేట్‌ అయ్యింది. గత వారం నామినేషన్స్‌లో కూడా శ్రీముఖి పేరుంది. ఎలాగోలా గట్టెక్కింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన శిల్ప చక్రవర్తి వేటుకు గురైంది. షార్ట్‌ అండ్‌ స్వీట్‌ పీరియడ్‌గా రెండు వారాలు మాత్రమే హౌస్‌లో ఉండి ఎలిమినేట్‌ అయ్యింది. ఇక హౌస్‌లో కేవలం 10 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరెవరు నామినేషన్స్‌లోకి వస్తారో.. ఈ వారం సడెన్‌ సర్‌ప్రైజ్‌లు ఏమేమి చోటు చేసుకుంటాయో.. మరి కొన్ని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు జరగనున్నాయో చూడాలి మరి.

 

ఇదిలా ఉంటే, 50వరోజు హౌస్‌ నుండి బయటికి వెళ్లిన ఆలీ రెజాని మళ్లీ హౌస్‌లోకి పంపిస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఆ ప్రచారం నిజమవుతుందా? లేక కొత్త సర్‌ప్రైజింగ్స్‌ ఏమైనా బిగ్‌బాస్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తుందా? చూడాలిక. ఈ సీజన్‌ బిగ్‌బాస్‌కి స్టార్‌ వేల్యూ పెద్దగా లేదు. ఫామ్‌లో లేని హీరో వరుణ్‌ సందేశ్‌ స్టార్‌డమ్‌ తప్ప హౌస్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ స్టార్‌ లేరు అని ఆడియన్స్‌ భావిస్తున్నారు. సో ఆ లోటును భర్తీ చేసే దిశగా బిగ్‌బాస్‌ టీమ్‌ కసరత్తులు చేస్తుందా?వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS