బుల్లితెర రాములమ్మగా యాంకరింగ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గానూ అదే దూకుడుతో దూసుకెళ్తోంది. అయితే, యాంకర్ శ్రీముఖికీ, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీముఖికీ చాలా చాలా తేడాలున్నాయి. వాటన్నింటినీ ఆడియన్స్ బేరీజు వేసుకుంటూనే వున్నారు. ఇదిలా ఉంటే, తాజా ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ వారి లైఫ్‌లో జరిగిన డార్క్ అండ్ బ్యాడ్ సీక్రెట్స్‌ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలని సూచించాడు. ఆ క్రమంలో శ్రీముఖి తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది.
గతంలో తాను ఓ వ్యక్తితో లవ్‌లో పడ్డాననీ, అనుకోని కారణాల వల్ల అతి భయంకరంగా ఆ లవ్‌ని బ్రేకప్ చేసుకోవల్సి వచ్చిందనీ, ఆ కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లి, విచక్షణ కోల్పోయి ఒకానొక సందర్భంలో సూసైడ్ చేసుకోబోయానని కూడా చెప్పింది. ఇంతవరకూ శ్రీముఖి ఎక్కడా తన పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకోలేదు. బిగ్‌బాస్ పుణ్యమా అని తన భయంకరమైన బ్రేకప్ ఇష్యూని బయటపెట్టింది.
అయితే, ఆ వ్యక్తి పేరు మాత్రం బయట పెట్టలేదు శ్రీముఖి. ఆ వ్యక్తి పేరు బయట పెట్టించేందుకు శివజ్యోతి చాలా ట్రై చేసింది. కానీ, కుదరలేదు. అలాగే, ఇతర కుటుంబ సభ్యులు కూడా తమ తమ లైఫ్‌లో జరిగిన డార్క్ సీక్రెట్స్‌ని ఈ సందర్భంగా షేర్ చేసుకోవడం జరిగింది.