రియాల్టీ షోస్‌లో బిగ్‌బాస్ రియాల్టీ షో వేరయా..! అంటే అంతటి ప్రత్యేకత ఉంది బిగ్‌బాస్ గేమ్ షోకి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ఏకంగా 13 ఎపిసోడ్స్‌కి ఒకే ఒక్క హోస్ట్ సల్మాన్ ఖాన్. అక్కడ బాగా ప్రజాదరణ పొందింది బిగ్‌బాస్. తమిళ బిగ్‌బాస్ కూడా సింగిల్ హోస్ట్ కమల్‌హాసన్‌తో రన్ అవుతోంది. ఇక తెలుగు విషయానికి వచ్చేసరికి మూడు సీజన్స్‌కీ ముగ్గురు హోస్ట్‌లు మారారు.
తొలి సీజన్ ఎన్టీఆర్ హోస్టింగ్‌లో ఓ రేంజ్‌లో సాగింది. రెండో సీజన్ హోస్ట్ నాని తన వంతు పూర్తి న్యాయం చేసినా, కంటెస్టెంట్లు, బిగ్‌బాస్ టాస్క్‌లతో మొదటి సీజన్‌ని మించిపోయింది. ఇక మూడో సీజన్ రైజింగ్ లెవల్‌లో సాగినా, తొలి మూడు రోజులకే చతికిలబడిపోయింది. హోస్ట్ విషయంలోనూ ఆడియన్స్ పెదవి విరిచేశారు. ఇక కంటెస్టెంట్లు వైపు నుండి కూడా మెల్ల మెల్లగా జోరు తగ్గిపోయింది. ఇన్ని రోజులూ ఒకెత్తు. క్లైమాక్స్ ఇంకో ఎత్తు. కనీసం క్లైమాక్స్‌లోనైనా ఆసక్తి కలిగిస్తారా? అంటే అక్కడ కూడా డీలా పడిపోయింది.
బిగ్‌బాస్ ప్రేమికుల గ్రాఫ్ అంతకంతకూ పడిపోతూ వచ్చింది. హోరా హోరీగా సాగాల్సిన బిగ్‌బాస్ క్లైమాక్స్ మరీ చప్పబడిపోయింది. డల్ టాస్క్‌లతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేసింది. దాంతో, బిగ్‌బాస్ చూడడం దండగ.. అనే పరిస్థితికి వచ్చేశారు ఆడియన్స్. అలాగే, విన్నర్ ఎవరనే విషయంపైనా ఆడియన్స్ ఓ క్లారిటీతో ఉన్నారు. సో ఈ సీజన్ బిగ్‌బాస్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అని ఆడియన్స్ తేల్చేశారు. దాంతో ఈ షోతో పెరగాల్సి టీఆర్‌పీ రేటింగ్ ఢమాల్‌న పడిపోయింది.