మహిళలకి తెలుగు చిత్ర పరిశ్రమలో వేధింపులు ఎక్కువ అవుతున్నాయి అని అలాగే అవకాశాలు ఇస్తాము అంటూ మోసం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తూ, పలువురు ప్రముఖుల ఫోటోలని విడుదల చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది శ్రీ రెడ్డి.
ఈ తరుణంలోనే శ్రీ రెడ్డి పలువురు సినీ తారల పైన వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేసింది. అలా నటి రకుల్ ని కుడా తీవ్రమైన పదజాలంతో దూషించడం కూడా జరిగింది. అయితే శ్రీ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దూషించడంతో మొత్తంగా ఆమె చెబుతున్న అంశం నీరుగారింది.
ఇక ఏమనుకుందో ఏమో కాని, రకుల్ ప్రీత్ ని దుర్భాషలాడినందుకు క్షమాపణలు కోరింది అలాగే ఇప్పుడు అందరు తనని ఒంటరిని చేసిన వేళ కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు అని చెప్పి ఇది తనని ఎంతో కదిలించేలా ఉంది అని అభిప్రాయపడింది.
మొత్తానికి శ్రీ రెడ్డి ఇలా పదే పదే మాటలు మార్చి మాట్లాడుతుండడంతో ఇప్పుడు ఆమెని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అన్నది సర్వాత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.