పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా పలు అంశాల పైన వ్యక్తుల పైన తనదైన శైలిలో ట్వీట్లు పెడుతున్నాడు.
అందులో భాగంగానే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆడవారి పైన జరుగుతున్న ఆకృత్యాలకి నిరసనగా పవన్ ఒక కొత్త ప్రతిపాదన తెచ్చారు. అదే ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి, ఇందులో పరిశ్రమకి చెందిన మహిళా సభ్యులు ఉంటారు అని అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో ఈ పోరాట సమితికి తన సొంత పార్టీ జనసేన తరపున ఉన్న మహిళా విభాగం మద్దతుగా నిలిస్తుంది అని కూడా ప్రకటించాడు. దీనితో మొన్న జరిగిన సంఘటనల నడుమ పవన్ కళ్యాణ్ అన్ని అంశాల పైన ఏదో ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశలో భాగంగా పనిచేస్తున్నట్టుగా చూడొచ్చు.
మరి ఈ తాజా ఆత్మగౌరవ పోరాట సమితిలో సభ్యులుగా ఎవరు అనేదాని పైన స్పష్టత రావాల్సి ఉంది..





 
 





 
  
  
  
  
  
  
  
  
					                 
                                


