'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో ఆ యంగ్ హీరోని చాలామంది సరిగా రిజిస్టర్ కూడా చేసుకోలేకపోయారు. నాని హీరోగా నటించిన ఆ సినిమాలో కన్పించింది కాస్సేపే అయినా తెరపై తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో అయిపోయాడు. అతనే విజయ్ దేవరకొండ.
'పెళ్ళిచూపులు', 'అర్జున్‌రెడ్డి' సినిమాలు అతని కెరీర్ గమనాన్నే మార్చేశాయి. 'పెళ్ళిచూపులు' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విజయ్, 'అర్జున్‌రెడ్డి'తో అయితే స్టార్‌డమ్ సంపాదించేసుకున్నాడు. లేటెస్ట్ హిట్ 'గీత గోవిందం'తో మనోడు తన స్టార్‌డమ్‌ని మరింత పెంచుకున్నాడు. చాలామంది యంగ్ హీరోలకి ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్ అనేది కలలా మిగిలిపోతోంటే, ఏకంగా 'గీత గోవిందం'తో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ని ఓవర్సీస్‌లో అందుకోవడానికి విజయ్ దేవరకొండ పరుగులు పెట్టేస్తున్నాడు.
'గీత గోవిందం' హిట్ తర్వాత విజయ్ దేవరకొండని ఎవరూ లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అతని తదుపరి సినిమాకి 40 కోట్ల బిజినెస్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండకపోవచ్చు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో, డిఫరెంట్ యాటిట్యూడ్‌తో తెరపై కన్పించే విజయ్ దేవరకొండలో 'ఫలానా నటుడ్ని ఇమిటేట్ చేస్తున్నాడు' అనే పోలికలు కన్పించవు. హీ ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్. అందుకే విజయ్ దేవరకొండ ఇప్పుడు బిగ్ స్టార్.. బిగ్గర్ స్టార్.
ఇప్పుడున్న యంగ్ తరంగ్‌లో ఇంత తక్కువ టైమ్‌లో ఇంత స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ మాత్రమే అనడం అతిశయోక్తి కాకపోవచ్చు.