తమిళ డైరెక్టర్ పైన శ్రీ రెడ్డి ఆరోపణలు

మరిన్ని వార్తలు

కాంట్రవర్సీకి కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయిన శ్రీ రెడ్డి మరోసారి తనదైన లీకులకి శ్రీకారం చుట్టింది. మొన్న తమిళ దర్శకుడు మురుగదాస్, తమిళ హీరో పైన కామెంట్ చేసిన తరువాత నిన్న మరో తమిళ సెలబ్రిటీ పైన ఆమె ఆరోపణలు చేసింది.

ఆ సెలబ్రిటీ మరెవరో కాదు గ్రూప్ డాన్సర్ నుండి కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన లారెన్స్. శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ ప్రకారం, లారెన్స్ ని గతంలో హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ హోటల్ ఒకసారి కలవడం జరిగిందట, ఆయన తన రూమ్ కి తీసుకెళ్ళి తనతో మాటలు కలిపి తనని వాడుకున్నట్టుగా తెలిపింది. ఈ సంఘటన తరువాత ఆమె కొంతకాలం లారెన్స్ స్నేహం కొనసాగించినప్పటికి తనకి సినిమా అవకాశం ఇవ్వలేదు అని చెప్పుకొచ్చింది.

దీనితో మరోసారి శ్రీ రెడ్డి #TamilLeaks పేరిట సంచలనాలకి కేంద్రబింధువుగా మారిపోయింది. ఇదే సమయంలో శ్రీ రెడ్డి లీకుల వ్యవహారం తెలుగు నుండి తమిళంకి పాకడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS