నాగ్ 'ఆఫీసర్' పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి

మరిన్ని వార్తలు

శ్రీ రెడ్డి మరోసారి తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నది. తాజాగా నాగార్జున ఆఫీసర్ పై తనదైన స్టైల్ లో కామెంట్ పెట్టి సంచలనం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, నాగార్జున-వర్మ కలయికలో వచ్చిన ఆఫీసర్ చిత్రం తనకి చాలాబాగా నచ్చిందని, నాగార్జున అద్భుతంగా నటించాడు, ఆర్జీవీ గ్రేట్ డైరెక్టర్ అంటూ కితాబు కూడా ఇచ్చేసింది. ఇదే పోస్టులో కావాలని కొంతమంది ఈ సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని వాళ్ళందరికి తమ అభిమాన హీరో సినిమా వచ్చినప్పుడు చూసుకుంటాను అని కూడా ఒక చిన్నపాటి హెచ్చరిక చేసింది.

ఇక ఇంతకీ ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని  టార్గెట్ చేసి పోస్ట్ పెట్టింది అని అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది ఈ పోస్ట్ చూసాక, కచ్చితంగా ఈమె వెనుక దర్శకుడు ఆర్జీవీ ఉండి ఇదంతా చేయిస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏదేమైనా.. పవన్ ఫ్యాన్స్ కి శ్రీ రెడ్డి కి మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నరచ్చ ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించట్లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS