పవన్ కళ్యాణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి- శ్రీ రెడ్డి

మరిన్ని వార్తలు

తన తల్లి పైనా, తన పైన శ్రీ రెడ్డి చేసిన అభ్యంతరకర పదజాలానికి నిరసన తెలుపుతూ ఒక 10 రోజుల క్రితం ఫిలిం చాంబర్ కి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా రావడం, ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ కి చెందిన హీరోలు రావడం తీవ్ర సంచలనం రేపింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న కొన్ని మీడియా చానల్స్ వాహనాల పైన పవన్ ఫాన్స్ దాడిచేయడం, పోలీసులు వెంటనే కొందరిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ అంశంలో పవన్ కళ్యాణ్ రాక వల్ల ఫిలిం ఛాంబర్ వద్ద కొద్దిపాటి తోపులాట జరిగిందని, తాను (శ్రీ రెడ్డి) ఫిలిం చాంబర్ ముందు స్వయంగా అర్ధనగ్న ప్రదర్శన ఇవ్వగా తనని మాత్రం, ఏదో ట్రాఫిక్ ఆపేసినట్టు గా చెబుతూ పెద్ద కేసు నమోదు చేశారు. అదే పవన్ కళ్యాణ్ పై మాత్రం ఫిలిం ఛాంబర్ నుండి ఎటువంటి చర్యలు లేవు.

దమ్ముంటే ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీన్నిబట్టి ఇండస్ట్రీలోని కొందు ప్రముఖులకి తమ పరపతి ఉపయోగించి ఇటువంటి వాటి నుండి తేలిగ్గా బయటకి వచ్చేస్తారు అని ఎద్దేవా చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS