డైరెక్టర్ ఇంటి ముందు దర్నాకి దిగనున్న శ్రీ రెడ్డి!

మరిన్ని వార్తలు

కొద్దిరోజులుగా మౌనవ్రతంలోకి వెళ్ళిపోయిన శ్రీ రెడ్డి మళ్ళీ ఒకసారి మీడియా ముందుకి వచ్చింది.

ఇక ఆమె చేసిన అర్ధనగ్న నిరసనకి అందరు షాక్ అవ్వగా ఇప్పుడు మరోసారి తన పోరాటాన్ని ముందుకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే ఒక ప్రముఖ స్టూడియో ముందు అలాగే ఒక ప్రముఖ దర్శకుడు ఇంటి ముందు ధర్నా చేయనుంది అన్న వార్తలు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి.

దీనితో ఒక్కసారిగా మీడియాతో పాటుగా సామాన్య ప్రజలు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ వార్త ప్రచారంలో ఉండగానే, శ్రీ రెడ్డి తన లాయర్ తో పాటుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది.

ఆ ప్రెస్ మీట్ లో తన ఉద్యమం ఆగిపోలేదు అని త్వరలోనే తన కార్యాచరణ మీకే తెలుస్తుంది అని మీడియా కి  చెప్పుకొచ్చింది. ఇక ఈ మీట్ లో మరోసారి ఇండస్ట్రీలోని ప్రముఖుల పైన చురకలు వేసింది శ్రీ రెడ్డి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS