గత నెల రోజులగా పలువురు సినీ ప్రముఖులపై అసభ్యరకరమైన ఆరోపణలు చేస్తూ, ఈ మీడియా, ఆ మీడియా అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రెచ్చి పోతున్న నటి శ్రీరెడ్డి హీరోయిన్స్‌పై కూడా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా నార్త్ హీరోయిన్స్ మైదాపిండి ముద్దలు, పిసరంత కండే లేని అస్థిపంజరాలు అలాంటి వారిని చూస్తే ఎలా మూడొస్తుందో? కానీ ఆ బక్క పలచని అందాలతో వల వేసి, మా తెలుగమ్మాయిలకు రావల్సిన అవకాశాల్ని తన్నుకెళ్లిపోతున్నారనీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్‌ని అయితే అస్సలు వదలట్లేదు. మొన్న గెడకర్రలా ఉంటుంది. చింపిరి జుట్టేసుకుని, పెద్ద డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ఎర వేస్తుంది. అలాగే అవకాశాలన్నీ దక్కించుకుంది అంటూ రకుల్‌పై ఆరోపణలు చేసింది.
మళ్లీ ఇప్పుడు కూడా రెక్కపీతా అంటూ సంబోధిస్తూ మరిన్ని ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఈవిడ గారు చేస్తున్న రచ్చకి 'మా' టీవి సభ్యత్వం కాన్సిల్ చేశారు. ఆమెతో ఎవ్వరూ నటించొద్దని ఆర్డర్ వేశారు. టోటల్‌గా సినీ ఇండస్ట్రీ నుండి ఈవిడ గార్ని బ్యాన్ చేసినట్లే దాదాపుగా. అయినా కానీ తన ఆరోపణలు ఆపట్లేదు. అర్ధనగ్నంగా ఫిల్మ్ నగర్ నడి బజార్లో నిలుచుని రచ్చ రంభోలా చేసింది.
ఈ రచ్చతో కావాల్సిన అవకాశాలు కాదు కదా, వచ్చిన అవకాశాలు కూడా చేజార్చుకుంటోంది. అయినా తెలియడం లేదు శ్రీరెడ్డికి. ఏం సాధిద్దామనో మరి ఈ లీక్స్ కారణంగా, తెలియడం లేదు. చూడాలి మరి ఇంకెంత దాకా వెళుతుందో ఈ 'ఛీ' లీకుల పర్వం. సారీ 'శ్రీ లీకులు'.