తమన్నాకి మెగా ఆఫర్

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నాకి అవకాశాలు క్రమక్రమంగా తగ్గుతున్న దశలో ఒక మెగా ఆఫర్ ఆమెని పలకరించింది.

అయితే ఆ మెగా ఆఫర్ ఏదో ఒక పాటకో లేక ఒక సన్నివేశానికో కాకుండా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పక్కన సైరా చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అందుతున్న వివరాల ప్రకారం, సైరా చిత్రంలో ఒక లీడ్ హీరోయిన్ పాత్ర కోసం తమన్నాని తీసుకున్నారట. ఇంతకముందు ఈ పాత్రకి బాలీవుడ్ తార ఐశ్వర్య రాయిని తీసుకుందామని నిర్మాతలు ప్రయత్నించారు.

ఏదేమైనా ఐశ్వర్య రాయి చేయవలసిన పాత్ర తమన్నాకి రావడంతో ఆమె కెరీర్ కి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో నా నువ్వే అని ప్రేమకథా చిత్రంలో తమన్నా నటిస్తున్నది.

ఇక ఈ మెగా ఆఫర్ అందుకున్న సందర్భంగా తమన్నాకి స్పెషల్ విషెస్...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS