ప్రముఖులపై అనిచిత వ్యాఖ్యలు చేయడమే కాదండోయ్. శ్రీరెడ్డి కొన్ని మంచి పనులు కూడా చేస్తోంది. సామాజిక సేవలో తాను కూడా భాగం కావాలనుకుంటోందట. ముఖ్యంగా మహిళల సమస్యలకు అండగా నిలవాలనే కొత్త ఆలోచనలు చేస్తోందట.
అందులో భాగంగానే తాజాగా ఓ మహిళ సమస్య నిమిత్తం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది శ్రీరెడ్డి. నటుడిగా బాలాజీ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. ఈయన భార్యకు కిడ్నీ సమస్య ఉండడంతో, ఆమెకు మ్యాచ్ అయ్యే కిడ్నీని దానం చేసే ఓ మహిళతో 20లక్షల డీల్ కుదుర్చుకున్నాడట గతేడాది బాలాజీ. అయితే ఆ డీల్ ప్రకారం సదరు మహిళకు అనుకున్నంత డబ్బును బాలాజీ ఇవ్వలేదంటూ, డబ్బు అడిగితే రెస్పాండ్ కావట్లేదనీ, సదరు మహిళ బాలాజీపై తాజాగా కేసు నమోదు చేసింది.
ఈ కేసులో సదరు మహిళకు మన శ్రీరెడ్డి మద్దతుగా నిలిచింది. ఆమెతో పాటు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి బాలాజీపై కేసు నమోదు చేయించింది. అయితే బాలాజీ మాత్రం ఆ డీల్ ఎప్పుడో సెట్ అయిపోయింది. ఆమె అడిగినంత డబ్బు ఇచ్చి ఎప్పుడో ఈ డీల్ సెట్ చేసేశాను అని ఆ డీల్‌కి సంబంధించిన ఒప్పంద పత్రాలను, బ్యాంకు లావాదేవీలను ప్రూఫ్స్‌గా పోలీసుల ముందుంచాడు.
అప్పటికే పోలీసులు బాధితురాలి ఫిర్యాదును స్వీకరించామనీ, న్యాయపరమైన సలహా మేరకు కేసు నమోదు విషయాన్ని పరిశీలిస్తామని బాలాజీకి తెలిపారు. అదీ సంగతి.