సంచలనాలకు కేంద్ర బిందువవుదామనుకున్న శ్రీరెడ్డి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి తెలుగునాట ఉనికి చాటుకునే పరిస్థితి లేక అరవ గడ్డకు పారిపోవాల్సి వచ్చింది. అక్కడేదో కొందరు సినీ ప్రముఖుల మీద ఆరోపణలు చేసి, అక్కడి మీడియా అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకుంది శ్రీరెడ్డి. తమిళ సినిమాల్లో శ్రీరెడ్డికి అవకాశాలు ఇస్తామంటూ ఒకరిద్దరు ముందుకొచ్చారు.
అయితే ఇలాంటి ప్రకటనలు వాస్తవ రూపం దాల్చడం కష్టం. ఆ సంగతి శ్రీరెడ్డికే అందరికన్నా బాగా తెలుసు. దాంతో పోరాటమంటూ శ్రీరెడ్డి చేస్తోన్న ఆరాటం వృధా అనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. తెలుగులోనూ చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయని శ్రీరెడ్డి నటిగా తానేంటో నిరూపించేసుకుంటానంటూ హల్‌చల్ చేస్తూ వచ్చింది. కొరియోగ్రాఫర్ టర్న్‌డ్ డైరెక్టర్ లారెన్స్ మీద శ్రీరెడ్డి ఆరోపణల గురించి విన్నాం. ఆ ఆరోపణలపై లారెన్స్ స్పందిస్తూ, 'టాలెంట్ చూపిస్తే, అవకాశమిస్తా' అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. దానికి శ్రీరెడ్డి స్పందించలేదు.
తెలుగు సినిమాల్లో అవకాశాల్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లు కొల్లగొట్టేస్తున్నారంటూ నానా యాగీ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడేమో తమిళ గడ్డ మీద అవకాశాల కోసం ప్రయత్నిస్తుండడం శోచనీయమే. అక్కడి హీరోయిన్లు కాదు కదా, క్యారెక్టర్ ఆర్టిస్టులూ, చిన్నా చితకా నటీమణులూ శ్రీరెడ్డిని సీరియస్‌గా తీసుకోవడంలేదు.
ఎందుకంటే ఆమెకు అంత సీన్ లేదని వారికీ తెలుసు. అర్థనగ్న ప్రదర్శనతో అప్పటికి పబ్లిసిటీ వచ్చిందేమోగానీ, అది అవకాశాల్ని తెచ్చిపెట్టలేదని శ్రీరెడ్డి తెలుసుకోలేకపోవడం ఆమె అమాయకత్వానికి నిదర్శనం.