శ్రీ రెడ్డి లీక్స్ లో భాగంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకుతో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలని విడుదల చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అయితే తెరవెనుక శ్రీ రెడ్డి తో ఈ సమస్యని పరిష్కరించడానికి ఆర్జీవీ రంగంలోకి దిగి ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినట్టుగా తెలిపాడు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని (సురేష్ బాబుకి తెలియకుండా) రూ 5కోట్ల డీల్ తో తాను ముగిద్దాము అని ప్రయత్నిస్తే అందుకు శ్రీ రెడ్డి ఒప్పుకోలేదు అని చెప్పుకొచ్చాడు.
దీనితో ఆమె పైన ఇంకా గౌరవం పెరిగి ఇంకా ఏమి చేస్తే ఈ అంశంలో శ్రీ రెడ్డికి బాగా ప్రచారం వస్తుందో అన్న కోణంలో తాను సలహాలు ఇచ్చినట్టుగా చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆర్జీవీ మాత్రం ఒక వ్యక్తిగా సామన్య ప్రజల్లో తనకి ఉన్న కొద్దోగొప్ప గౌరవాన్ని తానే పోగొట్టుకున్నాడు.
ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో శ్రీ రెడ్డి పాత్ర ఏంటో కనీసం ఆమెకైనా క్లారిటీ ఉందొ లేదో చూడాలి.