సెక్స్ రాకెట్ లో పేర్లు అంటూ లిస్టు విడుదల చేసిన శ్రీ రెడ్డి

By iQlikMovies - June 23, 2018 - 20:59 PM IST

మరిన్ని వార్తలు

సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ అయిన శ్రీ రెడ్డి తాజాగా టాలీవుడ్ ని కుదిపేస్తున్న చికాగో సెక్స్ రాకెట్ పైన తనదైన శైలో స్పందించింది. అయితే కేవలం స్పందించడమే కాకుండా తన వద్ద ఈ రాకెట్ కి సంబంధించి ఒక లిస్టు కూడా ఉంది అంటూ చెప్పి సంచలనానికి తెర తీసింది.

తాజాగా ఆ సెక్స్ రాకెట్ కి వీరికి సంబంధం ఉంది అంటూ దాదాపు ఒక ఇరవై పేర్లతో కూడిన జాబితాని శ్రీ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట చేసింది. ఈ లిస్టులో ప్రముఖ హీరోయిన్ల నుండి యాంకర్ల వరకు అలాగే సినీ పరిశ్రమకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ఉన్నారు.

 

అయితే ఈ లిస్టు లో ఉన్న పేర్లకి ఈ రాకెట్ కి సంబంధం ఉన్నట్టుగా మరేమీ ఆధారాలు లేకపోవడంతో మరోసారి శ్రీ రెడ్డి ఈ అంశాన్ని తన పబ్లిసిటి కోసం వాడుకుంటున్నది అన్న భిప్రాయం వ్యక్తమవుతున్నది.

మొత్తానికి ఈ లిస్టు విడుదలతో మరోసారి శ్రీ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS