సోషల్ మీడియా వేదికగా చేసుకుని శ్రీరెడ్డి, తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులపై ఆరోపణల పర్వం కొనసాగిస్తోంది. తమిళ సినీ ప్రముఖులు కూడా అవకాశాల పేరుతో తనను వాడుకున్నారంటూ ఒక్కొక్కరి పేర్లనూ బయటపెడుతోంది. తమిళ నటుడు శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్‌గా సుపరిచితుడు) తనను వాడుకున్న వైనం గురించి జుగుప్సాకరంగా శ్రీరెడ్డి ఇప్పటికే చెప్పింది. మురుగదాస్, లారెన్స్, తాజాగా ఇంకో యువ నటుడి పేరునీ బయటపెట్టింది.
సోషల్ మీడియాలో శ్రీరెడ్డికి ఫాలోయింగ్ తక్కువ, యాంటీ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. కొందరైతే 'ఇంతమందితో తిరుగుతున్నావ్ కదా, నీకు హెచ్‌ఐవీ సోకలేదా?' అని ప్రశ్నించేసరికి శ్రీరెడ్డికి ఒళ్ళు మండిపోయింది. 'కండోమ్‌లనేవి వున్నాయి. నా జాగ్రత్తలు నాకున్నాయి. నేను పోరాటం చేస్తోన్నది, నాలా ఇంకొకరి జీవితం నాశనమవకూడదనే. అర్థం చేసుకుని మాట్లాడండి' అని గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
తెలుగులో సామ్రాట్, సురేష్‌బాబు తనయుడు, కోన వెంకట్, నాని సహా పలువురు ప్రముఖుల పేర్లను వివాదాల్లోకి లాగిన శ్రీరెడ్డి, తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సంగతి తెల్సిందే. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, ముందు ముందు తన విమర్శల పర్వాన్ని బాలీవుడ్‌కీ, ఆ తర్వాత హాలీవుడ్‌కీ కొనసాగిస్తుందేమోనని కొందరు వెటకారం చేస్తున్నప్పటికీ, ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని సోషల్ మీడియాలో ఆమెకి ఇంకొందరు మద్దతు పలుకుతున్నారు.