బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలు, స్నేహాలు ఎంత బాగుంటాయో అదే తరహాలో కోపాలు కూడా ఉంటున్నాయి. దీనికి తాజా ఉదాహరణ నిన్న ఇంటి నుండి వెళ్ళిపోయే సమయంలో భాను శ్రీ మాట్లాడిన మాటలే...
అవేంటంటే- గేమ్ ని గేమ్ లాగే ఆడండి.. ఎలిమినేషన్స్ అప్పుడు నేను తోపు అని చెప్పడానికి కాకరకాయ జ్యూస్ తాగడం.. తప్పుగా అనుకోకు దీప్తి.. జెనెరల్ గా నాకు అనిపించింది చెప్తున్నా.. నేనేదో చేసెయ్యాలి.. నేను జనాలలో ప్రేమని తీసేసుకోవాలి అని ఆడొద్దు దయచేసి గేమ్ ని గేమ్ లాగే ఆడండి.
ఇది అయిపోయాక బిగ్ బాంబు విషయంలో తనకి బిగ్ బాస్ ఇంటిలో ముందునుండి ఇష్టం లేని కౌశల్ పైనే ఆ బాంబు వేసింది. ఆ బాంబు ప్రకారం, అమిత్ ఆ ఇంటిలో ఎప్పుడు కుర్చీ పైన కూర్చోవాలి అని అనుకున్నా వెంటనే కౌశల్ సదరు కుర్చీని తెచ్చి అమిత్ కి వేయాల్సి ఉంటుంది.
సహజంగా బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళే సమయంలో మేము మారిపోయాము అని చెప్పేవాళ్ళని చూస్తుంటాము కాని ఇలా తనకి నచ్చని వాళ్ళని ఇంటి నుండి బయటకి వచ్చే సమయంలో కూడా భాను శ్రీ విడిచిపెట్టకపోవడం కొసమెరుపు.