తన సినిమా ప్రమోషన్స్ విషయంలో కొరటాల శివ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు అతనికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. టాలీవుడ్‌లో అసభ్య ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి కొరటాలపై కూడా ఆరోపణలు చేసింది. కొరటాల ఆమెతో చేసిన వాట్సాప్ ఛాటింగ్‌ని బయట పెట్టింది. ఈ నేపథ్యంలో 'భరత్ అనే నేను' సినిమా ప్రమోషన్స్‌లో కొరటాల పాల్గొంటాడా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు కొరటాల శివ రావాల్సి వుంటుంది.
శ్రీ రెడ్డి లీక్స్ నేపథ్యంలో ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వస్తాడా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ప్రమోషన్స్ విషయంలో బయటికి వస్తే, శ్రీరెడ్డి ఇష్యూలో ఖచ్చితంగా కొరటాలకు ప్రశ్నల దాడి ఎదురవుతుంది. అందుకే ఒకవేళ ఈ విషయాన్ని అవైడ్ చేయాలనే ఉద్దేశ్యంతో కొరటాల ఉంటే, మీడియా ముందుకు రాకపోవచ్చు. కానీ కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించిన సినిమా 'భరత్ అనే నేను'. సూపర్ స్టార్ మూవీ ఇది.
అలాంటిది ఈ సినిమా ప్రమోషన్స్‌కి డైరెక్టర్ రాకపోవడం అంటే జరిగే పని కాదు. అందుకే ఇన్‌సైడ్ సోర్స్ వర్గాల నుండి అందిన సమాచారమ్ ప్రకారం, కొరటాల తనపై వచ్చిన ఆరోపణల్ని లైట్ తీసుకున్నాడట. అందుకే స్పందించడం అనవసరం అని అనుకుంటున్నాడట. కానీ మీడియా ముందుకు వస్తే మాత్రం తప్పదు పెదవి విప్పాల్సిందేగా.!