శ్రీ రెడ్డి.. శ్రీ రెడ్డి.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారు ఈ పేరు వినకుండా ఎవరు ఉండరు అని చెప్పొచ్చు. కారణం ఈ అమ్మాయి గత కొన్ని రోజులగా తన బోల్డ్ ఇంటర్వ్యూల తో సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపొయింది.
ఇక నిన్నటి రోజున తన సోషల్ మీడియా ఎకౌంటు లో ఒక దర్శకుడిని జైలుకి పంపిస్తాను అంటూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు అంతర్జాలంలో కలకలం రేపుతున్నది. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు. అయితే ఆయన గతంలో పలువురు నటీమణుల పైన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు అని మాత్రం చెబుతున్నారు.
మళ్ళీ తాజాగా శ్రీ రెడ్డి ఈ డైరెక్టర్ గురించి SHE టీం పోలీసులకి ఫిర్యాదు చేస్తాను, జైలుకి పంపిస్తాను అని చెప్పడంతో మరోసారి శ్రీ రెడ్డి, దర్శకుడు అజయ్ కౌండిన్యల పేర్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
మరి శ్రీ రెడ్డి చెప్పినట్టుగానే సదరు డైరెక్టర్ పైన కేసు పెడుతుందా? అరెస్ట్ చేయిస్తుందా? అనేది వేచి చూడాలి.