శ్రీదేవి, రమ్యకృష్ణని మించిపోయేదా?

మరిన్ని వార్తలు

'బాహుబలి'లో శివగామి పాత్రలో రమ్యకృష్ణని చూసిన తర్వాత ఆ పాత్రలో ఇంకొకర్ని ఊహించుకోగలమా? అవకాశమే లేదు. ఎందుకంటే ఆ పాత్రకు ఆమెకన్నా గొప్పగా న్యాయం చేసేవారు ఇంకెవరూ ఉండరనిపిస్తుంది. అంతలా 'శివగామి' పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. తన అనుభవాన్నంతా రంగరించి, శివగామి పాత్రకు రమ్యకృష్ణ రాయల్‌ లుక్‌ ఆపాదించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి ముందుగా నిన్నటితరం అందాల భామ శ్రీదేవిని సంప్రదించారట. ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పలేదుగానీ, రమ్యకృష్ణ ఉండగా ఇంకొకర్ని సంప్రదించినందుకు క్షమాపణ కోరుతున్నానని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ ఇంకొకరు శ్రీదేవే. ఒకవేళ శ్రీదేవి 'శివగామి' పాత్రలో నటించినా ఆ పాత్రకు అంత వెయిట్‌ వచ్చేది కాదు. శ్రీదేవి గొప్ప నటి అయినప్పటికీ రమ్యకృష్ణతో ఈ తరం ఆడియన్స్‌ కనెక్ట్‌ అయినట్లు శ్రీదేవితో కనెక్ట్‌ అవలేరేమో. అందుకే ఈ విషయాన్ని రాజమౌళి గోప్యంగా ఉంచేశారు. నిజమే అలనాటి మేటి నటిగా శ్రీదేవిని ఎవ్వరూ మర్చిపోలేరు. కానీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆమె పెద్దగా తన అనుభవాన్ని కానీ, ప్రతిభని కానీ సరిగా చూపించింది లేదు. కానీ ఈ తరహా హుందా అయిన పాత్రలు రమ్యకృష్ణకి కొట్టిన పిండి లాంటివి. అందుకే కొన్ని పాత్రల్లో కొందరిని మాత్రమే అనుమతించగలం. మరెవ్వరినీ ఊహించుకోలేం. అలాగే 'బాహుబలి'కి శివగామిగా రమ్యకృష్ణ ఆయువు పట్టులాంటిది. ఆ పాత్రకు ఆమె తప్ప మహా నటి సావిత్రిని కూడా ఊహించుకోలేం. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS