శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించి వారం గడవకముందే ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పుట్టినరోజు రావడం జరిగింది. ఇక నిన్న ఆమె తన 21వ పుట్టినరోజుని జరుపుకుంది.
ఇక తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్న ఆమెని కపూర్ కుటుంబసభ్యులు అందరు ఓదార్చారు. ఆమె పుట్టినరోజుని కుటుంబసభ్యులంతా ఒక చోట చేరి ఆమెతో కేక్ కట్ చేయించారు. అదే సమయంలో ఆమె ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి వారి మధ్య తన పుట్టినరోజుని జరుపుకుంది.
అయితే కుటుంబసభ్యులు అందరు ముఖ్యంగా కపూర్ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు అందరు జాన్వీ కపూర్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఇదే సమయంలో బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అయిన అన్షులా కపూర్ కూడా అక్కడ ఉండడం విశేషం.
మొన్న శ్రీదేవి మరణించిన విషయం తెలియగానే అర్జున్ కపూర్, అన్షులా కపూర్ లు బోనీ కపూర్ వెంటనే ఉన్నారు.