శ్రీదేవి మరణం ఆ తరువాత మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాగే నిన్న సాయంత్రంతో శ్రీదేవి అంత్యక్రియలు ముగిసిన తరువాత శ్రీదేవి కుటుంబం నుండి ఒక ప్రకటన వెలువడింది.
అలాగే శ్రీదేవి ట్విట్టర్ ఎకౌంటు నుండి ఆమె భర్త బోనీ కపూర్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటనల సారంశామేమిటంటే -
శ్రీదేవి మరణం అభిమానులని ఎంతగా కలిచివేసిందో అంతకంటే ఎక్కువగా కుటుంబసభ్యులైన మమ్మల్ని కూడా అదే స్థాయిలో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఈ విషాధకర సమయంలో అభిమానులు, మీడియా, స్నేహితులు తమకి ఎంతగానో అండగా నిలిచారు. అయితే ఇప్పుడు తామున్న పరిస్థితుల్లో కొన్నిరోజులు తమని ఒంటరిగా వదిలేయమని, ఎందుకంటే-శ్రీదేవి లేదనే నిజాన్ని తాము జీర్ణించుకోవడానికి తమకి ఇంకా సమయం పడుతుంది అని తెలిపారు.
ఇదే సమయంలో శ్రీదేవి పిల్లలు జాన్వీ, ఖుషి అలాగే భర్త భోనీ కపూర్ లకి జరిగిన వ్యక్తిగత నష్టం నుండి వారు కోలుకునే వరకు వారిని ఇబ్బందిపెట్టే వాతవరణం ఎవరూ సృష్టించవద్దు అని అందరికీ విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రకటన ఒకటి కపూర్, అయ్యప్పన్ & మర్వా కుటుంబాల పేరుతో రాగా మరొకటి బోనీ కపూర్ పేరిట విడుదల చేశారు.