శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆమె పార్థివ దేహాన్ని ఎరుపు రంగు బంగారపు అంచున్న చీరతో ముస్తాబు చేశారు. నుదుటున నిండైన సింధూరం, కళ్లకు కాటుకలో అలంకరించారు. ఆమెకు ఎంతో ఇష్టమైన హారాన్ని ఇతర నగలను మెడలో వేశారు. శ్రీదేవికి తెలుపు రంగు పూలంటే ఎంతో ఇష్టమనీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అలాగే ఆమె జడను తెల్లని పూలతో అలంకరించారు. ఆమె అంతిమ యాత్రకు సిద్ధం చేసిన వాహనాన్ని కూడా తెల్లని పూలతోనూ, తెల్లని వస్త్రాలతోనూ అలంకరించారు. ఇలా నిండైన ముస్తాబుతో శ్రీదేవి పార్ధివదేహం చూస్తుంటే, కడుపు నిండిపోతోంది. నిజంగా ఆమె అతిలోకసుందరి అందులో నో డౌట్ అనిపిస్తోంది. శ్రీదేవికి మరణం లేదు. హాయిగా శ్రీదేవి నిద్రపోతోంది.. అన్నట్లుగానే ఉంది.
ఇక మరోపక్క శ్రీదేవి అంతిమయాత్రకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు. మరో వైపు సోషల్ మీడియా అంతా ఆరాధ్య దేవత శ్రీదేవి ఘన నివాళులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఒక్క వీడియోతో సెన్సేషన్ అయిపోయిన 'ఒరు అదర్ లవ్' సినిమా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ శ్రీదేవికి నివాళిగా 'కబి అల్విదా న కెహనా' పాట పాడి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే 'ఎప్పటికీ గుడ్‌బై చెప్పొద్దు' అని అర్ధం. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ, తన అభిమాన నటి శ్రీదేవి ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తున్నానంటూ కన్నీటి నివాళి అర్పించింది.
అలాగే రామ్‌గోపాల్ వర్మ, శ్రీదేవి మరణ వార్త విన్నప్పటి నుండీ ఆయన తన మనసులోని బాధని చెప్పుకోలేక చెప్పుకుంటూ ట్విట్టర్‌లో స్పందిస్తున్న వైనం వర్ణనాతీతం. శ్రీదేవి మృతికి సంతాపంగా ముంబయిలో హోలీ సంబరాలు రద్దు చేసినట్లు సమాచారమ్.