మీడియా ముందు సహనం కోల్పోయిన హీరో శ్రీకాంత్..!

By iQlikMovies - March 10, 2018 - 14:28 PM IST

మరిన్ని వార్తలు

ఎప్పుడు సౌమ్యంగా ఉండే హీరో శ్రీకాంత్ కి ఒక్కసారిగా కోపమొచ్చింది. ఎప్పుడు నవ్వుతు ఉండే శ్రీకాంత్ కి ఇలా కోపం రావడానికి కారణం లేకపోలేదు.

ఆయన కారుకి యాక్సిడెంట్ అయింది అని అలాగే ఆ యాక్సిడెంట్ లో శ్రీకాంత్ తీవ్ర గాయాలు అయినట్టు వార్తలు షికారు చేశాయి. దీనితో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్రంగా కలతచెందారు. ఈ అంశాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు.

ఈ మధ్యకాలంలో కొంతమంది యుట్యూబ్ లో వీడియోలు పెట్టడం దానికి ఏదో ఒక సంచలనం రుద్దుతూ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆ వీడియో కి లైక్స్ తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పాడు. అయితే ఇటువంటి వాటి పైన తమ ‘మా’ అసోసియేషన్ తీవ్రంగా పరిగణిస్తున్నది అని చెప్పాడు.

త్వరలోనే వీటి పైన పోలీసులకి కంప్లైంట్ ఇవ్వనున్నట్టు కూడా తెలిపాడు. మొత్తానికి ఈ వార్త ఎప్పుడు ప్రశాంతంగా ఉండే శ్రీకాంత్ ని కూడా కోపోద్రిక్తుడిని చేసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS