దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతని చలనచిత్ర పరిశ్రమలో తరుచుగా వాడుతుంటారు. ఇక ముఖ్యంగా హీరోయిన్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మరింతగా ఈ మాటని వాడుతుంటారు. కారణం వారికి నటనకి సంబంధించి హీరోలతో పోలిస్తే తక్కువ సమయం ఉంటుంది కాబట్టి.
అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం ఇలా ఆఫర్ వచ్చిన ప్రతి సినిమా కాకుండా తనకి అన్నివిధాలుగా నచ్చితేనే చేస్తాను అని పట్టుపట్టి కూర్చున్నదట. ఆ హీరోయిన్ ఎవరంటే సురభి. ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన సురభికి విజయాలతో పాటు అపజయాలు ఎదురయ్యాయి.
ఇక ఈమధ్యనే ఒక్క క్షణంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తరువాత ఆమెకికొన్ని సెకండ్ హీరోయిన్ రోల్స్ రావడంతో వాటిని తిరస్కరించిందట. మెయిన్ లీడ్ అయితేనే చేస్తాను అని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఏదేమైనా ఈ అమ్మడు ఇంత పట్టుపట్టడానికి కూడా కారణం ఉండక మానదు.