టాలీవుడ్‌కి విలన్స్ కొరత ఉంది. అందుకే బాలీవుడ్ నుండీ, కోలీవుడ్ నుండీ కొత్త కొత్త విలన్లను తెచ్చుకుంటున్నాము. అయితే మన టాలీవుడ్‌లోనే బోలెడంత మంది విలన్లు ఉన్నారు. జగపతిబాబు విలన్‌గా మారాక ఈ కొరత కొంచెం తీరిందనే అనుకోవాలి. అయితే తాజాగా శ్రీకాంత్ విలన్‌గా మారి టాలీవుడ్‌కి మరికొంత విలన్ కొరత తీర్చాడనిపిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'యుద్ధం శరణం' సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు హీరోగా అంతగా సక్సెస్‌లు లేవు శ్రీకాంత్‌కి. దాంతో విలన్‌గా రూటు మార్చాడు. విలన్ పాత్రలు శ్రీకాంత్‌కి కొత్తేం కాదు. గతంలో విలన్‌గా పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా సక్సెస్ అయ్యాక, విలనిజం పక్కన పెట్టేశాడు. లేటెస్ట్ మూవీ 'యుద్ధం శరణం'కి సంబంధించి విడుదలైన టీజర్‌లో శ్రీకాంత్ విలన్‌గా అప్పియరెన్స్ అదిరిపోతోంది. ఎక్కడెక్కడినుండో విలన్లను దిగుమతి చేసుకోవడం కాదు, టాలెంట్ మన దగ్గరే ఉందనిపిస్తోంది. అయితే ప్రేక్షకుల ఆలోచనల్లోనూ, ఇండస్ట్రీ ఆలోచనలోనూ మార్పులు రావాలి. హీరోగా చూసిన కళ్లతో విలన్‌గా చూడలేం అనే ఆలోచనా ధోరణి మారితే, టాలెంటెడ్ పర్సన్స్ విలన్స్‌గానూ తమ సత్తా చాటగలరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ అవుతూనే, నెగిటివ్ రోల్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. అలాగే మనలోంచే చాలా మంది హీరోలు విలన్లుగా కూడా నటిస్తే మన ఇండస్ట్రీకి విలన్ల కొరత అస్సలు ఉండదు. నటుడు అన్నాక అన్ని రకాల యాంగిల్స్‌లోనూ నటిస్తేనే తన ఇన్నర్ టాలెంట్ బయటికి వస్తుంది. నటనలో కొత్తదనం కనిపిస్తుంది.