బ్లాక్‌ బస్టర్‌ 'శ్రీనివాస కళ్యాణం'.!

మరిన్ని వార్తలు

'శ్రీనివాస కళ్యాణం' సినిమాకి ప్రీ రిలీజ్‌ బజ్‌ సూపర్బ్‌గా ఉంది. కొంతమంది సినీ ప్రముఖులు ఆల్రెడీ సినిమాని చూసేశారు. వారు చెప్పిన రిపోర్ట్స్‌ ప్రకారం 'శ్రీనివాస కళ్యాణం' బ్లాక్‌ బస్టర్‌ కావడం తథ్యమని తెలుస్తోంది. వినూత్నంగా నిర్వహించిన ప్రమోషన్స్‌ ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అవకాశాలు లేకపోలేవు. ప్రమోషన్స్‌ సంగతి అటుంచితే, విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌ ప్రకారం సినిమాలో కంటెన్ట్‌ చాలా బాగుందని తెలుస్తోంది.

 

దాని ప్రకారం సినిమాకి హిట్‌ పక్కా అంటున్నారు. నితిన్‌ - రాశీఖన్నా జంట చూడముచ్చటగా కనిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన కథనం ప్రకారం సాగే కథ ఇది. పెళ్లి నేపథ్యంలో ఇంతవరకూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా ఈ సినిమాలో ఏదో కొత్తదనం చూపించారట. ఆధ్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేసే సన్నివేశాలు చాలా ఉన్నాయట ఈ సినిమాలో. హాయిగా, ఆహ్లాదంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడదగ్గ చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

 

ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న నితిన్‌కి ఈ సినిమా మరో 'అఆ' లాంటి బ్లాక్‌ బస్టర్‌ని అందించడం ఖాయమనిపిస్తోంది. 'తొలిప్రేమ' సినిమాతో సక్సెస్‌ మీదున్న రాశీఖన్నా మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోనుంది 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో. సక్సెస్‌ఫుల్‌ బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 9న 'శ్రీనివాస కళ్యాణం' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS