డియర్ కామ్రేడ్ షూటింగ్ షురు...

By iQlikMovies - August 06, 2018 - 18:29 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ & మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా "కామ్రేడ్" రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (ఆగస్ట్ 6) మొదలైంది. 

ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు. ఆంధ్రా స్లాంగ్ లో విజయ్ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. 

సోషల్ రెస్పాన్సబిలిటీ ఉన్న ఇంటెన్స్ రోల్ ను విజయ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ "డియర్ కామ్రేడ్" చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- ప్రెస్ రిలీజ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS