బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ త్రుటిలో ఓ పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఆనంద్ ఎల్ రాయి దర్శకత్వంలో రుపొందోతున్న చిత్రానికి సంబందించిన షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఆ షూటింగ్ కోసం నిర్మించిన ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలి కింద పడింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షారుఖ్ స్పాట్ లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం నుండి భయటపడ్డాడట.
అయితే గాయపడిన వారికి కూడా చిన్న గాయాలే అవ్వడంతో యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకున్నారు.