షూటింగులకు మళ్లీ ఎప్పుడు అనుమతులు ఇస్తారో అని చిత్రసీమ యావత్తూ ఆసక్తి ఎదురు చూసింది. అయితే ఆ అనుమతులు ఇచ్చినా - షూటింగులు చేయడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. షూటింగులు మొదలెడితే.. యుద్ధ ప్రాతిపదికన `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్‌ని మొదలెడతామని చెప్పిన రాజమౌళి సైతం ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకూ ఆర్.ఆర్.ఆర్ షూటింగు మొదలెట్టే ఛాన్సులు లేవన్నది తాజా టాలీవుడ్ ఖబర్.
దానికి రాజమౌళి అండ్ కో చెప్పే కారణం వేరేలా ఉన్నాయి. హైదరాబాద్ శివర్లలో ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన సెట్ తీర్చిదిద్దారు. ఆ సెట్లోనే షూటింగ్ జరగాలి. షూటింగ్ లేకపోవడం వల్ల...ఆ సెట్ పాతబడిపోయింది. ఇప్పుడు దానికి మరమత్తులు చేసి, కొత్తగా సిద్ధం చేయాలి. అందుకు కాస్త సమయం పడుతుంది. పైగా కొత్త షెడ్యూల్స్ వేసుకోవాలి. కాల్షీట్లు చూసుకోవాలి. ఇవన్నీ టైమ్ తీసుకునే వ్యవహారాలు. అందుకే.. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.