రాజమౌళి... దేశం గర్వించదగిన దర్శకుల్లో ఆయన ఒకరు. ఎప్పుడూ కూల్ అండ్ కామ్ గా ఉంటారు. అయితే తొలిసారి ఆయనకు ఆగ్రహం కలిగింది. అదీ.. ఢిల్లీ ఎయిర్ పోర్టు లో కనిపించిన వాతావరణం. అక్కడి పరిస్థితులపైన. ఢిల్లీ విమానాశ్రయంలోని సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈరోజు తెల్లవారుఝామును విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులో లాండ్ అయ్యారు రాజమౌళి. కొన్ని పత్రాలు పూర్తి చేయడానికి కనీస వసతులు లేవట. చాలామంది నిలబడే.. పత్రాలు పూర్తి చేస్తున్నారని, పత్రాల్ని.. గోడకు ఆనించి రాస్తున్నారని, కనీసం బల్లలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాదు.. ఢిల్లీ ఎయిర్ పోర్టు బయటకు రాగానే విధి కుక్కుల సమూహం స్వాగతం పలికిందని, ఇలాంటి అసౌకర్యం, వాతావరణం చూస్తే.. విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఓసారి ఆలోచించుకోవాలని ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బందిని ఆయనకోరారు. డిల్లీ ఎయిర్ పోర్టులోనే కాదు.. చాలా చోట్ల ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంటుంది. అన్నింటితో పోలిస్తే.. షంషాబాద్ విమానాశ్రయం ఎన్నో వందల రెట్లు బెటర్. రాజమౌళి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి.. ఢిల్లీ విమానాశ్రయ అధికారులు, సిబ్బంది ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.