మ‌హేష్ + ప్ర‌భాస్ + రాజ‌మౌళి

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి త‌ల‌చుకుంటే ఏ కాంబినేష‌న్ అయినా సాధ్య‌మే. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను ఓకే స్క్రీన్ పై చూపిస్తున్న ఘ‌న‌త ఆయ‌నిదే. ఇప్పుడు మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల‌ను కూడా క‌లిసిక‌ట్టుగా చూపించ‌బోతున్నార‌ని టాక్‌. అవును.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత రాజ‌మౌళి ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈసారి మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల‌తో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

 

మ‌హేష్‌తో రాజ‌మౌళి ఓ సినిమా చేస్తార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. మహేష్ కూడా రాజ‌మౌళితో సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధం అవుతోంది. అయితే ఈసారి మ‌హేష్‌తో పాటు, ప్ర‌భాస్ కూడా ఈ సినిమాలో క‌నిపిస్తార‌ని స‌మాచారం.

 

ఇదే నిజ‌మైతే... మ‌రో అద్బుత‌మైన కాంబోని తెలుగు ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నార‌న్న‌మాట‌. అయితే ఈ వార్త‌లో నిజ‌మెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS