హాలీవుడ్ కే తలదన్నేలా తెలుగు సినిమాని తీర్చిదిద్దిన ఘనత రాజమౌళిది. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే... అది లార్జన్ దెన్ బిగ్ స్క్రీన్ అనుకునే రోజులివి. అలాంటిది రాజమౌళి ఇప్పుడు ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. అది కూడా 19 నిమిషాల నిడివి గలది. అవును.. రాజమౌళి నుంచి త్వరలో ఓ షార్ట్ ఫిల్మ్ రానుంది. అయితే ఇది... కమర్షియల్ గా తీస్తున్న షార్ట్ ఫిల్మ్ కాదు. జనాలకు కరోనాపై అవగాహన కలిగించేందుకు. హైదరాబాద్ పోలీస్ వారి సహకారంతో.. రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాఉడ.
కరోనా నేపథ్యంలో సాగే ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే విడుదల కానుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ ముగ్గురూ కలిసి `ఆర్.ఆర్.ఆర్` చేస్తున్నారు కదా. ఆ అనుబంధం కొద్దీ.. చరణ్, ఎన్టీఆర్‌లు తలో చేయీ వేసే అవకాశం వుంది. మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఏ రేంజులో ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.