‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో మహేశ్ సరసన పూజాహెగ్డే సందడి చేయనుంది. సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యారు. కాగ ఈ సినిమా షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైయింది. ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ని చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది.
#SSMB28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమాకు ‘పార్థు’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిమరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందని, దాని కోసం దర్శకుడు మరో హీరోను ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సుశాంత్‌ను సంప్రదించినట్టు టాక్. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సుశాంత్ ముఖ్య భూమిక పోషించారు. ఆయన నటనను మెచ్చిన త్రివిక్రమ్ మరోసారి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.