మహేష్ బాబు - త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేస్తున్నారని తెలుసు. కానీ ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్లూ రాకపోవడం మహేష్ అభిమానుల్ని కలవరపెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రకటిస్తారని అనుకొన్నారు. కానీ చెప్పలేదు. కనీసం అప్ డేట్ అయినా ఇస్తారనుకొన్నారు. అదీ ఇవ్వలేదు. దాంతో సూపర్ స్టార్ అభిమానులు నిరాశ పడ్డారు. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. షూటింగ్ వివరాలు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నామని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించేశారు. అంతేకాదు... 2023 వేసవిలో ఈ చిత్రాన్ని విడుద లచేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. పూజా హెగ్డేని కథానాయికగా ఎంచుకొన్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే.
నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తారు. ఏఎఎస్ ప్రకాష్‌ని ఆర్ట్ డైరెక్టర్‌గా ఎంచుకొన్నారు. పి.ఎస్ వినోద్ కెమెరా మెన్ గా తీసుకొన్నారు. మొత్తానికి టెక్నికల్ టీమ్ స్ట్రాంగ్‌గానే ఉంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మరో స్టార్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.