రాజమౌళి మనసులో మెదిలిన ఊహకి, తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేతి రాతతో తెరపై సృష్టించబడిని మహాద్భుతం 'బాహుబలి' సినిమా. సినిమా అంటే సినిమాగా కాదు. ఇదో బ్రాండ్‌గా మారిపోయింది. సినిమా వచ్చిందిలే వెళ్లిందిలే అన్నట్లుగా కాకుండా గత ఐదేళ్లుగా 'బాహుబలి' ట్రెండ్ నడుస్తోందంటే ఆ సినిమా తెచ్చిన క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇదేదో తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకుల మనసుల్ని మాత్రమే గెలచుకుంది అంటే అది కూడా కాదు.. ఏకంగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఓ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. అందుకే దీనికి కంక్లూజన్ లేకుండా పోయింది. ఇప్పటికే 'బాహుబలి ది బిగినింగ్' అంటూ తన పాత్రల సృష్టితో పరిచయమైన 'బాహుబలి' కథకి తాత్కాలికంగా 'బాహుబలి ది కంక్లూజన్'తో ఫుల్ స్టాప్ పెట్టినా, కానీ, ఈ సినిమాకి కంక్లూజన్ లేదంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా మేనియాతో జనం ఇంకా ఇంకా 'బాహుబలి'ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. దాంతో రాజమౌళి ఈ సినిమాకి పార్ట్ 3 కూడా తెర రూపం కల్పించాలని అనుకుంటున్నాడట. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా మూడో పార్ట్‌కి కథ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనీ తెలియ వస్తోంది. ఇకనేం 'బాహుబలి' అయిపోలేదు. ఇంకా ఉంది. ఈ మాట 'బాహుబలి' ప్రియులకు విన సొంపుగా ఉందట. అయితే ఇది కార్య రూపం దాల్చేందుకు ఇంకా చాలా టైం పడుతుందండోయ్.