కళాతపస్వి కె విశ్వనాధ్ గారు నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించారు. ఈ సందర్బంగా యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకీ అభినందనలు తెలియచేస్తున్నది.
ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కళాతపస్వికి ఈ అవార్డు స్వీకరించిన నేపధ్యంలో శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇక అవార్డు అందుకున్న సందర్భంలో విశ్వనాధ్ గారు మాట్లాడుతూ- తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు అలాగే తన అభిమానులకి ఈ స్థాయికి ఎదిగేల చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.
విశ్వనాధ్ గారికి అవార్డు రావడం నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక మరిచిపోలేని జ్ఞాపకం.