కన్నప్పలో స్టార్స్ బజ్ కోసమా?

మరిన్ని వార్తలు

మంచు విష్ణు చాలా ఏళ్ళగా సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు సడెన్ గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ని స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి, రక రకాలుగా వార్తల్లో  ఉంటోంది. ముఖ్యంగా ఇందులో ఉన్న స్టార్ క్యాస్టింగ్ గూర్చి అంతా చర్చించుకుంటున్నారు.  పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండటంతో భారీ బడ్జెట్ పెడుతున్నారు. అన్ని భాషల స్టార్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. క్యాస్టింగ్ పెరగటంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గటం లేదు. అసలు ఫామ్ లో లేని విష్ణు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడని, విష్ణుకి ఉన్నమార్కెట్ కి ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నాడు? నిజంగా కథపై ఉన్న నమ్మకమా, లేదా ఇందులో ఉన్న క్యాస్టింగ్ ని నమ్ముకునా. ముఖ్యంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నాడనే ధీమాతో విష్ణు ఇలా రిస్క్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.          


ఇప్పటికీ ఈ మూవీకి అనుకున్న బడ్జెట్ 100 కోట్లు. కానీ ఇందులో ఉన్న స్టార్స్ కి ఇచ్చే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఎవరెవరికి ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు. ఎంత ఇస్తున్నారు, వీరంతా ఎందుకు నటించటానికి ఒప్పుకున్నారు. విష్ణుపై వీరికి ఇంత నమ్మకం ఉందా, లేదా కథ పై నమ్మకమా? రెమ్యునరేషన్ వలన అని తెలియాల్సి ఉంది. అసలు సినిమాలో వారి పాత్రలకి నిజంగా ఇంపార్టెన్స్ ఉందా? లేదా క్రేజ్ కోసం ఇలా స్టార్స్ ని పెడుతున్నాడా అన్నది కూడా తెలియదు. ఈ చిత్రం లో మొదట ప్రభాస్ శివుడిగా నటిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తుండగా నందీశ్వరుడిగా ప్రభాస్ చేస్తున్నాడు. మాములుగా ఒక్కో సినిమాకి 150 కోట్లు తీసుకునే డార్లింగ్ కన్నప్పలో ఫ్రీ గా నటిస్తున్నాడు . ఇందుకోసం ఒక వారం రోజులు కాల్షీట్స్ కేటాయించడాన్ని సమాచారం. 


ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో పాటు, కన్నడ హీరో శివ రాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, తమిళం నుంచి శరత్ కుమార్, నార్త్ నుంచి అక్షయ్ కుమార్, లు ఉన్నారు. హీరోయిన్ గా మొదట కృతిసనన్ సిస్టర్ నూపుర్ సనన్ ని అనుకున్నారు. పూజా కార్యక్రమాలు  కూడా చేశారు. కానీ ఇప్పుడు నయన తార నటిస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతిగా అనుష్క, నటిస్తున్నారు. నయన తార ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటుంది. ఈ లెక్కన నయన్ బడ్జెట్ 10 కోట్లు ఉంటే మిగతావారికి ఎంత ఉంటుందో. స్టార్ కాస్టింగ్ తో కన్నప్పని భారీ మల్టీస్టారర్ గా రూపొందిస్తున్నారు.  ఈ యాక్టర్స్ ని కరక్ట్ గా విష్ణు వాడుకుంటే కన్నప్ప నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్ లో సగం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS